కొత్తగా ఉద్యోగంలో చేరే యువతను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద ఒక్కొక్కరికి రూ. 15వేల వరకు నగదు ప్రోత్సాహకం అందించే ప్రక్రియను ఈపీఎఫ్ఓ (EPFO) వేగవంతం చేసింది. ఈ సహాయాన్ని రెండు విడతలుగా, మొదటి విడత ఆరు నెలల ఉద్యోగం తర్వాత అందించనున్నారు. అయితే కేవలం కంపెనీలో ఆఫర్ లెటర్ అందుకోగానే ఈ మొత్తం ఖాతాలోకి పడిపోదు. సర్వీస్ రూల్స్ పాటించాల్సిన ఉంటుందని EPFO నిబంధనలు పెట్టింది.
అర్హులు ఎవరు? శాలరీ ఎంతుండాలి?..
ఈ పథకం ద్వారా ఈపీఎఫ్ ఓ నుంచి రూ. 15 వేల ప్రోత్సాహకం పొందాలంటే.. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 మధ్య ఉద్యోగంలో చేరిన ఫ్రెషర్లు దీనికి అర్హులు. నెలకు లక్షలోపు జీతం ఉంటే రెండు విడతల్లో డీబీటీ ద్వారా ఈమొత్తం అందుతుంది. 6 నెలల సర్వీస్ , 12 నెలల కంటిన్యూగా ఉద్యోగం చేయడంతోపాటు ఆర్థిక అక్షరాస్యత అంటే డబ్బును దీర్ఘకాలిక పొదుపు చేయడం తప్పని సరిచేసింది. ఉద్యోగి చేరిన సంస్థ కచ్చితంగా ఈపీఎఫ్ఓ పరిధిలో ఉండటంతో పాటు, క్రమం తప్పకుండా పీఎఫ్ చలాన్లు (ECR) ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఈ పథకం ద్వారా రూ. 15వేల ప్రోత్సాహకం ఒకేసారి చేతికి అందదు. మొదటి విడతగా ఆరు నెలల సర్వీస్ పూర్తయిన తర్వాత గరిష్టంగా రూ. 7,500 వరకు నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది. రెండో విడత మొత్తం 12 నెలల సర్వీస్ ,ఈపీఎఫ్ఓ నిర్వహించే 'ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాతే అందుతుంది. ఈ రెండో విడత మొత్తాన్ని దీర్ఘకాలిక పొదుపు అలవాటును పెంచేందుకు నిర్దేశిత సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలో ఉంచుతారు.
ఉద్యోగులు చేయాల్సిన తక్షణ పని
ఈ ప్రోత్సాహకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాకు నేరుగా చేరుతుంది. కాబట్టి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం, బ్యాంక్ అకౌంట్ సీడింగ్ పూర్తి చేయడం తప్పనిసరి. ఉమాంగ్ (UMANG) యాప్ లేదా అధికారిక PM-VBRY పోర్టల్ ద్వారా వివరాలను సరిచూసుకోవాలి.
