Pragyan Ojha: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ (Men's Selection Committee) నియామకాలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగియడంతో, అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన సీనియారిటీ ప్రాతిపదికన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha) ను సెలక్షన్ కమిటీ కొత్త ఛైర్మన్ (చీఫ్ సెలెక్టర్) గా నియమించినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అలాగే వెస్ట్ జోన్ ప్రతినిధిగా మాజీ స్పిన్నర్ రమేష్ పొవార్ (Ramesh Powar) ను ప్యానెల్లోకి తీసుకున్నట్లు వెల్లడించింది.
అజిత్ అగార్కర్‌కు బీసీసీఐ ధన్యవాదాలు:
గత మూడేళ్లుగా భారత చీఫ్ సెలెక్టర్‌గా అత్యుత్తమ సేవలు అందించిన అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కు బీసీసీఐ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. అగార్కర్ తన పదవీ కాలంలో చూపిన నిబద్ధత, నిశ్చయాత్మక నిర్ణయాలు, జట్టు విజయాల్లో అందించిన సహకారాన్ని బోర్డు కొనియాడింది.
ఐదుగురు సభ్యులతో కమిటీ:
* ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha) – ఛైర్మన్ / చీఫ్ సెలెక్టర్
* శివ్ సుందర్ దాస్ (Shiv Sundar Das) – సభ్యుడు
* ఆర్‌పీ సింగ్ (RP Singh) – సభ్యుడు
* అజయ్ రాత్రా (Ajay Ratra) – సభ్యుడు
* రమేష్ పొవార్ (Ramesh Powar) – సభ్యుడు
మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా భారత సెలక్షన్ కమిటీకి సారథ్యం వహించడంపై అభిమానులు, క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ట్రోఫీల దృష్ట్యా ఈ కమిటీ నిర్ణయాలు అత్యంత కీలకం కానున్నాయి.
ALSO READ : నిషాద్ కుమార్‌కు గోల్డ్ మెడల్..
🚨 Announcement 🚨 Mr Ramesh Powar @imrameshpowar appointed to Men’s Selection Committee. Based on seniority (most Tests), Mr Pragyan Ojha @pragyanojha will chair the Committee. BCCI appreciates Mr Ajit Agarkar @imAagarkar for his commitment, conviction and contribution during his tenure as Chairman of the Committee. Details ▶️ https://t.co/z0jcyPWkr0 #TeamIndia
— BCCI (@BCCI) October 19, 2026
