నిషాద్ కుమార్‌కు గోల్డ్ మెడల్.. లాంగ్ జంప్‌లో అదిరిపోయే అరంగేట్రం!

నిషాద్ కుమార్‌కు గోల్డ్ మెడల్.. లాంగ్ జంప్‌లో అదిరిపోయే అరంగేట్రం!

Nishad Kumar Wins Gold: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026 (Asian Para Games 2026) లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. షూటింగ్‌లో వచ్చిన పసిడి ఊపును కొనసాగిస్తూ, అథ్లెటిక్స్ విభాగంలోనూ భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. పురుషుల T47 లాంగ్ జంప్ ఈవెంట్‌లో రెండుసార్లు పారాలింపిక్స్ రజత పతక విజేత నిషాద్ కుమార్ (Nishad Kumar) అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

తొలిసారే బరిలోకి దిగి.. ఆల్-టైమ్ డామినేషన్: 

నిషాద్ కుమార్ హైజంప్ ఈవెంట్లలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగా.. తొలిసారిగా లాంగ్ జంప్ (Long Jump) పోటీలో అడుగుపెట్టాడు. ఎప్పూడూ లేని విధంగా తొలిసారి లాంగ్ జంప్ ఈవెంట్‌లో బరిలోకి దిగినప్పటికీ, ఏమాత్రం తడబడకుండా తన ప్రత్యర్థులందరినీ వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ పోటీలో నిషాద్ తన అత్యుత్తమ ప్రదర్శనగా 7.11 మీటర్ల దూరం దూకి గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

పోడియంపై సత్తా చాటిన ఇతరులు: 

ఉత్కంఠభరితమైన లాంగ్ జంప్ ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్ అథ్లెట్ ఓమద్‌బెక్ ఖసనోవ్ (Omadbek Khasanov) 6.99 మీటర్ల జంప్‌తో రజత పతకం (Silver) సాధించగా.. శ్రీలంకకు చెందిన మొహమ్మడు సఫ్రాన్ (Mohammadu Safran) 6.55 మీటర్ల దూరంతో కాంస్య పతకం (Bronze) దక్కించుకున్నారు.