బైక్ షోరూమ్ లో మహిళ అమ్మవారిగా చెప్పుకుంటూ హల్ చల్ చేసిన వీడియో వైరల్ గా మారింది. భర్తతో పాటు షోరూమ్ కు వెళ్లిన మహిళ.. ఒక్కసారిగా పూనకం వచ్చి ఊగిపోయి అక్కడ ఉన్నవారిని భయాందోళనలకు గురిచేసింది. నేను దుర్గామాతను రా అంటూ రచ్చ రచ్చ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా సర్క్యులేట్ అవుతోంది.
దసరా పండుగ సందర్భంగా కొత్త బైక్ తీసుకోవాలని షోరూమ్ కు వెళ్లారు భార్యాభర్తలు. ఎంచుకున్న బైక్ ధర చెప్పగానే షాక్ తిన్నట్లుగా.. పూనకం వచ్చినట్లుగా మహిళ ఒక్కసారిగా ఊగిపోయింది. నేను మాతారాణిని రా.. దుర్గా మాతను. బైక్ ధర పది వేల రూపాయలు తగ్గిస్తావా లేదా అంటూ కేకలు పెడుతూ.. పూనకంతో ఊగుతూ రచ్చ రచ్చ చేసింది. దీంతో షోరూమ్ స్టాఫ్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యింది.
బైక్ ధర లక్షా 10 వేల రూపాయలు ఉండగా.. పది వేలు డిస్కౌంట్ తో లక్ష రూపాయలకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. ఒకవేళ ధర తగ్గించకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. అమ్మవారికి కోపం తెప్పించకండిరా.. అంటూ ఊగిపోయింది. అయితే మహిళ పూనకానికి భయపడని షో రూమ్ సిబ్బంది ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వడం కుదరదని చెప్పేశారు. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ దంపతులు.
ALSO READ : రైళ్లు, రైల్వే స్టేషన్లలో ఫోన్ స్పీకర్‌లో పెట్టి మాట్లాడుతున్నారా ?
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
INI BARU PERTAMA KALI GUE LIAT DEWI TURUN KE BUMI BUKAN BUAT NGASIH BERKAH, TAPI MINTA DISKON MOTOR. 😭💀 Di India, seorang perempuan mau beliin suaminya motor seharga 110 ribu rupee. Begitu denger harga, mendadak teriak-teriak ngaku sebagai Dewi Mata Rani. Tuntutannya? POTONG HARGA 10 RIBU RUPEE ATAU SHOWROOM KENA MURKA ILAHI. 🤣 Tapi plot twist-nya, pemilik showroom kagak gentar. Harga tetep, diskon nol! Gue bayangin isi kepala sales-nya: "Bu, mau titip KTP sama KK atau surat rekomendasi dari kahyangan?" 💀 Belum jelas ini akting, candaan, atau kejadian spontan. Tapi kalau ceritanya bener, ini negosiasi paling absurd: yang satu bawa ancaman supernatural, yang satu bertahan pake daftar harga. Bahkan kekuatan langit kalah sama kebijakan fixed price. 😭 https://t.co/3QptEuHwRN
— Fatahillah (@Fatahilah03) October 18, 2026
