దసరా ముందు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నిండా ముంచిన బ్యాంకింగ్ స్టాక్స్!

దసరా ముందు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నిండా ముంచిన బ్యాంకింగ్ స్టాక్స్!

దసరా ముందు రోజున భారత స్టాక్ మార్కెట్లు ఊహించని విధంగా భారీ నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇంట్రాడేలో అత్యధికంగా 1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సూచీ క్లోజింగ్ నాటికి 876 పాయింట్ల నష్టంతో స్థిరపడింది. ఇదే సమయంలో మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 257 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 356 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 642 పాయింట్లు కోల్పోయింది. సోమవారం మార్కెట్లో ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ పతనం సూచీలను నష్టాలబాట పట్టించింది. ఈ క్రమంలో మార్కెట్ల పతనానికి కారణాలను పరిశీలిస్తే..

ముందుగా బ్యాంకింగ్ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన వేళ ప్రైవేటు బ్యాంకింగ్ స్టాక్స్ హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్స్ భారీగా పతనం కావటం నష్టాలకు కారణంగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర వడ్డీ ఆదాయ మార్జిన్లపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేయటమే అమ్మకాలకు కారణంగా ఉంది. ఇదే క్రమంలో ఏఐ ఫండింగ్ ఆందోళనలు, గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల పనితీరు ఇండియన్ స్టాక్ మార్కెట్లను బలహీనపరిచిందని నిపుణులు చెబుతున్నారు. 

ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 108 డాలర్ల స్థాయికి చేరుకోవటంతో కూడా మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈరోజు వాస్తవానికి క్రూడ్ ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ రేటు అధికంగానే కొనసాగటంపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.