పండుగ ముగిసింది.. పట్నం బాట పట్టిన జనాలు.. హైదరాబాద్ వచ్చే రూట్లలో భారీ ట్రాఫిక్ జామ్

పండుగ ముగిసింది.. పట్నం బాట పట్టిన జనాలు.. హైదరాబాద్ వచ్చే రూట్లలో భారీ ట్రాఫిక్ జామ్

దసరా పండుగ ముగిసింది. సొంత ఊళ్లకు వెళ్లిన జనాలు మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. దీంతో 2026 అక్టోబర్ 21 సాయంత్రం హైదరాబాద్ వచ్చే రూట్లు చీమల బారుల్లాగ వాహనాల రద్దీతో నిండిపోయాయి. 

విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు కిలోమీటర్ల నిలిచిపోయాయి. నార్కట్ పల్లి, చిట్యాల, పెద్దకాపర్తి పంతంగి టోల్‌ప్లాజా వరకు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర హైదరాబాద్‌ వైపు 9 టోల్‌ బూత్‌లు ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు.

గురువారం (అక్టోబర్ 22) స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ అవుతుండటంతో నగరం బాట పట్టారు జనాలు. అంతే కాకుండా పలు ఆఫీసులు యదావిధిగా ప్రారంభం అవుతుండటంతో సెలవులు ముగించుకుని సిటీ వస్తున్నారు. 

ALSO READ : 1986 నుంచే నా దగ్గర రివాల్వర్ ఉంది

ప్రస్తుతం టోల్ గేట్ల దగ్గర కనుచూపు మేర ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా పోలీసులు కీలక జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.