ఏపీలో నామినేషన్ల గడువు పెరిగే ఛాన్స్ ఉన్న మున్సిపాలిటీలు ఇవే !

ఏపీలో నామినేషన్ల గడువు పెరిగే ఛాన్స్ ఉన్న మున్సిపాలిటీలు ఇవే !

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 17 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో తమ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వైసీసీ దాఖలు చేసిన ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబర్ 25 వరకు పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఏపీ ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. నామినేషన్లు వేయని చోట 48 గంటల సమయం పెంచాలని సూచించింది. అభ్యర్థుల భద్రతకు డీజీపీ అన్ని చర్యలు తీసుకోవాలని -సుప్రీంకోర్టు ఆదేశించింది.

అయితే.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు మొత్తంగా వాయిదా వేయడానికి, గడువు పెంచడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. నామినేషన్ల దాఖలుకు తమను అడ్డుకున్నారని ఇప్పటికే అభ్యర్ధులు ఫిర్యాదు చేసి ఉంటే.... వాటిని మాత్రమే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది.

ALSO READ : నామినేషన్ల గడువు పొడిగించండి: ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

నామినేషన్లు దాఖలు అడ్డుకున్నారన్న ఫిర్యాదులపై రేపటి లోగా (అక్టోబర్ 22) తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీం కోర్టుకు వైసీపీ సమర్పించిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల లిస్ట్ ఇదే.

1. పిడుగురాళ్ల మున్సిపాలిటీ
2. గురజాల నగర పంచాయతీ
3. దర్శి నగర పంచాయతీ
4. పుంగనూరు మున్సిపాలిటీ
5. మైదుకూరు మున్సిపాలిటీ
6. కమలాపురం నగర పంచాయతీ
7. ఎర్రగుంట్ల నగర పంచాయతీ
8. రాయచోటి మున్సిపాలిటీ
9. దాచేపల్లి నగర పంచాయతీ
10. గుత్తి మున్సిపాలిటీ

11. కడప మున్సిపల్ కార్పొరేషన్
12. రాజంపేట మున్సిపాలిటీ
13. పులివెందుల మున్సిపాలిటీ
14. బద్వేల్ మున్సిపాలిటీ

15. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్
16. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ
17. కనిగిరి నగర పంచాయతీ
18. తాడిపత్రి మున్సిపాలిటీ
19. జమ్మలమడుగు నగర పంచాయతీ