Ranabaali Day 5 Collection : ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్న 'రణబాలి' కలెక్షన్స్.. 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

Ranabaali Day 5 Collection : ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్న 'రణబాలి' కలెక్షన్స్.. 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' బాక్సాఫీస్ వద్ద జోరు పెంచింది. తొలి రోజుల్లో మిశ్రమ వసూళ్లతో సాగిన ఈ సినిమా.. ఐదో రోజు కలెక్షన్లలో పెరుగుదల నమోదు చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రక యాక్షన్ డ్రామా ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఐదో రోజు కలెక్షన్లలో జంప్..

అక్టోబర్ 20, మంగళవారం ‘రణబాలి’ ఇండియా నెట్ వసూళ్లు రూ.7.10 కోట్లుగా నమోదైనట్లు ట్రెడ్ వర్గాల చెబుతున్నాయి. సోమవారం వచ్చిన రూ.5.40 కోట్లతో పోలిస్తే మంగళవారం కలెక్షన్లు భారీగా పెరగడం విశేషం. దీంతో ఐదు రోజుల్లో సినిమా ఇండియా నెట్ వసూళ్లు రూ.36.55 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు దాదాపు రూ.52.75 కోట్లు దాటినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం రూ.9.25 కోట్లతో ప్రారంభమైన ఈ చిత్రం, శనివారం రూ.7.30 కోట్లు, ఆదివారం రూ.7.50 కోట్లు వసూలు చేసింది. సోమవారం వసూళ్లు తగ్గినా, మంగళవారం మళ్లీ పుంజుకోవడం సినిమాకు సానుకూల పరిణామంగా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే వసూళ్లు ఇలా..

ప్రాంతాల వారీ గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రధాన మార్కెట్లుగా నిలిచాయి. మంగళవారం ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.6.65 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కర్ణాటక నుంచి రూ.82 లక్షలు, తమిళనాడు నుంచి రూ.13 లక్షలు వచ్చాయి. మరోవైపు, తెలుగు 2డీ వెర్షన్ ఆక్యుపెన్సీ 50.92 శాతంగా నమోదైంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం షోలకు ప్రేక్షకుల స్పందన మెరుగ్గా కనిపిస్తోంది.  అయితే తుది వసూళ్లపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

నార్త్ అమెరికాలోనూ అదే జోరు..

విదేశీ మార్కెట్లలోనూ 'రణబాలి' ఆశాజనకంగా సాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే 8 లక్షల డాలర్ల గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. త్వరలోనే మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 16 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు వచ్చిన నివేదికలు కూడా సినిమాపై ఆసక్తిని సూచిస్తున్నాయి.

ALSO READ :  డబ్బు కోసం దొంగగా మారిన మౌళి.. 'దొంగ నా కొడుకు' టీజర్ అదిరిందిగా!

19వ శతాబ్దపు బ్రిటిష్ వలస పాలన నేపథ్యంలో తిరుగుబాటు, ప్రతిఘటన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషించగా, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం రూ.60 కోట్ల దిశగా సాగుతున్న 'రణబాలి' రానున్న రోజుల్లో ఎంత వసూలు చేస్తుందో ఆసక్తికరంగా మారింది.