మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన రివాల్వర్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దసరా పండుగ ఆయుధ పూజలో పాల్గొన్న ఆయన.. రివాల్వర్ చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
విజయదశమి సందర్భంగా హైదరాబాద్ బోయినపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా తన రివాల్వర్‌కు పూజలు చేసిన అనంతరం ఆయన తన తుపాకీకి సంబంధించిన కొన్ని పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.
తానున్న ఈ రివాల్వర్‌ను 1986లో సింగపూర్‌లో కేవలం 3 వేల రూపాయలకే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆయుధాన్ని కేవలం తన ఆత్మరక్షణ కోసమే దగ్గర ఉంచుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ : బారికేడ్లకు ఒక ఉద్దేశం ఉంటుంది..
దీనికి అప్పట్లోనే ఆల్ ఇండియా లైసెన్స్ పర్మిషన్ తీసుకున్నానని, 40 ఏళ్లుగా ఈ రివాల్వర్ తన వద్దే భద్రంగా ఉందని చెప్పారు.
బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆయుధపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు. #Mallareddy #AyudhaPooja #Boinpally #MedchalMLA https://t.co/uqoq1va5EF
— V6 News (@V6News) October 21, 2026
