మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్

కర్ణాటకలోని మైసూరులు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి మైసూరు ఉత్సవాల్లో పాల్గొన్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు.. 2026 అక్టోబర్ 21న సతీసమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు.

 వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ కు.. కర్ణాటక సీఎం డేకే శివకుమార్ ఆహ్వానం పలికారు. మైసూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జంబూ సవారి ఊరేగింపులో, అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో ఊరేగిస్తున్న చాముండేశ్వరిదేవి ఉత్సవ విగ్రహ ఊరేగింపులో పాల్గొన్నారు.  

ఈ ఊరేగింపులో జానపద కళాకారులు, సంగీత, నృత్య బృందాలు, కర్ణాటక గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

మైసూరు ప్యాలెస్‌లో జరిగే వేడుకలకు హాజరయ్యే ముందు, సీఎం రేవంత్  చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి, మైసూరు అధిష్టాన దేవత అయిన అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

ALSO READ : సీజేపీ నాయకులకు భారీ ఊరట.. 

ఈ వేడుకల్లో కేరళ సీఎ వీడీ సతీషన్, వివిధ రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.