కాక్రచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకులు అశుతోష్ రాంక, సౌరవ్ దాస్ లకు భారీ ఊరట లభించింది. 2026 అక్టోబర్ 21న (బుధవారం) సీజేపీ నేతలను విడుదల చేయాలని ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 14 నుంచి కస్టడీలో ఉన్న సీజేపీ కోకన్వీనర్లకు ఊరట లభించింది.
జ్యుడీషియల్ కస్టడీ కొనసాగింపుపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న గంటల వ్యవధిలోనే ఈ తీర్పు రావడం గమనార్హం.
సౌరవ్ దాస్ వ్యక్తిగత బాండ్ ను అంగీకరిస్తున్నట్లు చెప్పిన కోర్టు.. తీహార్ జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. మరే ఇతర కేసుల పేరున ఆయనను అదుపులోకి తీసుకోవాల్సి అవసరం లేదని పేర్కొంది.
బుధవారం ఇరువురు నేతల కస్టడీ ముగుస్తుండటంతో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. ప్రొసీడింగ్స్ సందర్భంగా వారి షూరిటీలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
ALSO READ : బారికేడ్లకు ఒక ఉద్దేశం ఉంటుంది.. విదేశాలు తగలబడటం చూడటం లేదా?
జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశం నుంచి నిషేధించిన తర్వాత జాతీయ జెండాలతో ముట్టడి చేయగా నిషేధాజ్ఞలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అక్టోబర్ 14 నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. అయితే వారి కస్టడీ అక్టోబర్ 19న ముగియటంతో.. కస్టడీ పొడిగింపుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టుకు వచ్చే ముందు స్పెషల్ కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ తర్వాత ఈ పిటిషన్లను విచారించిన స్పెషల్ కోర్టు వారిని విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది.
