కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఒడ్డున పూజలు చేస్తున్న భక్తులకు గాయాలు

 కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఒడ్డున పూజలు చేస్తున్న భక్తులకు గాయాలు

కృష్ణా నదిలోకి కారు దూసుకెళ్లిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపింది. దసరా పండుగ సందర్భంగా పూజలు చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులను ఢీకొడుతూ నదీలోకి దూసుకెళ్లటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

దసరా పండుగ 2026 అక్టోబర్ 21న జరిగింది ఈ ఘటన. గద్వాల్ పట్టణం నది అగ్రహారం దగ్గర  అదుపు తప్పిన కియా కారు నదిలోకి దూసుకెళ్లింది. పండుగ మరుసటి రోజు కావడంతో భక్తులు  నది ఒడ్డున పూజలు నిర్వహిస్తుండగా కారు దూసుకొచ్చింది. 

పూజలో ఉన్న భక్తులను ఢీకొట్టి కారు నదిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో భక్తులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ : పెండ్లి కోసం ఏపీ నుంచి హైదరాబాద్కు ప్రేమ జంట..