Ram Charan Sukumar : రామ్ చరణ్ సరసన 'సయ్యారా' బ్యూటీ.. సుకుమార్ మనసులో అసలు ఎవరున్నారంటే?

Ram Charan Sukumar : రామ్ చరణ్ సరసన 'సయ్యారా' బ్యూటీ.. సుకుమార్ మనసులో అసలు ఎవరున్నారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబోలో సినిమా రాబోతుండటంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.  లేటెస్ట్ గా ఈ 'RC17' ప్రాజెక్ట్‌కు సంబంధించిన హీరోయిన్ ఎంపికపై ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రామ్ చరణ్‌కు జోడీగా 'సయ్యారా' బ్యూటీ.

ఈ సినిమాలో కథానాయికగా 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ నటించనున్నట్లు గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. అయితే లేటెస్ట్ గా మరో బాలీవుడ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. 'సయ్యారా' సినిమాతో ఒక్కసారిగా యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న అనీత్ పడ్డా.. రామ్ చరణ్ సరసన నటించే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది.

యూత్‌లో ఫుల్ క్రేజ్

'సయ్యారా' చిత్రంతో అనీత్ పడ్డా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యువతను ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు తన నటనతోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఆమెను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే సారా అర్జున్, అనీత్ పడ్డా పేర్లలో ఎవరి వైపు దర్శకుడు మొగ్గు చూపుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. లేదా ఇద్దరు భామలు'RC17' లో ఉంటా అన్న ప్రశ్నకూడా తలెత్తుతోంది. అయితే ఈ  హీరోయిన్ల ఎంపిక విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ : ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్న 'రణబాలి' కలెక్షన్స్..

మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారా?

మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ నెలలో సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. 'రంగస్థలం'తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన రామ్ చరణ్, సుకుమార్.. ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హీరోయిన్‌గా ఎవరు ఖరారవుతారనే ఉత్కంఠకు మేకర్స్ ఎప్పుడు తెరదించుతారో చూడాలి.