తెలంగాణకు వాన కబురు.. ఇవాళ (అక్టోబర్ 21), రేపు (అక్టోబర్ 22) వానలే వానలు !

తెలంగాణకు వాన కబురు.. ఇవాళ (అక్టోబర్ 21), రేపు (అక్టోబర్ 22) వానలే వానలు !

తెలంగాణలో ఇవాళ (అక్టోబర్ 21), రేపు (అక్టోబర్ 22) వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ పేర్కొంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక.. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

చెన్నైలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై సిటీలో నీటమునిగిన సాలిగ్రామం, టినగర్‌, వలసరవాకం, గిండి ప్రాంతాలు నీటమునిగిన పరిస్థితులున్నాయి.

చెన్నైలోని మీనంబాకంలో అత్యధికంగా 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నుంగంబాకంలో 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించిన అధికారులు, తమిళనాడులో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. మరోవైపు ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా.. ఏపీలోని పోలవరం, కోనసీమ, మార్కాపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.