చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: మంత్రి వివేక్ వెంకటస్వామి

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: బెల్లంపల్లిలో జరిగిన దసరా వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ అని.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని చెప్పారు. ప్రజా పాలన ప్రభుత్వం ద్వారా మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామని తెలిపారు.

దేశంలోనే తెలంగాణలో రైతులకు 23 వేల కోట్ల రుణమాఫీ చేశామని, సన్న బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ లాంటి పథకాలను ప్రవేశపెట్టామని, ప్రభుత్వం విద్య వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. 

ALSO READ : సొంతూరిలో సీఎం రేవంత్ దసరా పండుగ..

జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంత నిరుద్యోగులకు మందమర్రిలో జర్మనీ భాషపై ట్రైనింగ్ ఇస్తున్నామని, బెల్లంపల్లి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రావణ వధ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం చాలా సంతోషమని, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.