2027లో దాదాపు పండగలన్నీ శని, ఆదివారాలే.. పాపం ఉద్యోగులు.. లాంగ్ వీకెండ్ హాలీడేస్ ఛాన్సే లేదు !

2027లో దాదాపు పండగలన్నీ శని, ఆదివారాలే.. పాపం ఉద్యోగులు.. లాంగ్ వీకెండ్ హాలీడేస్ ఛాన్సే లేదు !

ఈసారి కార్పొరేట్ ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ హాలీ డేస్కు అవకాశమే లేదు. ఎందుకంటే.. 2027లో ముఖ్యమైన పండుగలన్నీ వారాంతాల్లోనే వచ్చాయి. పండుగలు గురు లేదా శుక్ర వారాలు వస్తే శని, ఆది వారాలు ఎలాగూ సెలవు కాబట్టి ఐటీ ఉద్యోగులు ఫ్యామిలీస్తో ట్రిప్పులు, టూర్లకు ప్లాన్ చేస్తుంటారు. కానీ.. పాపం ఈసారి ఆ ఛాన్సే లేదు.

ఎందుకంటే.. శివరాత్రి, స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, గాంధీ జయంతి, దసరా, క్రిస్మస్.. ఇలా ముఖ్యమైన పండుగలన్నీ శని, ఆదివారాల్లో రావడం గమనార్హం. లాంగ్ వీకెండ్స్ కోసం ఆశ పడే ఉద్యోగులకు 2027 పీడకలనే అని చెప్పక తప్పదు. దీపావళి పండుగ కూడా శనివారమే రావడం గమనార్హం. 2027లో ప్రధాన పండుగలు ఏఏ తేదీల్లో, ఏ వారం వచ్చాయో ఓ లుక్కేద్దాం.

* మహా శివరాత్రి (మార్చి 6, శనివారం)
* మేడే (శనివారం)
* స్వాతంత్ర్య దినోత్సవం ( ఆదివారం)
* వినాయక చవితి (సెప్టెంబర్ 4, శనివారం)
* గాంధీ జయంతి (శనివారం)
* దసరా (అక్టోబర్ 9, శనివారం)
* దీపావళి (అక్టోబర్ 30, శనివారం)
* గురు నానక్ జయంతి (నవంబర్ 14, ఆదివారం)
* క్రిస్మస్ (శనివారం)

ఇదిలా ఉండగా.. కార్పొరేట్ సంస్థలకు నిర్ణీత సంఖ్యలో సెలవులు ఎలాగూ ఉంటాయి. పండుగలు వారాంతంలో వచ్చినా, రాకపోయినా సెలవులు దొరకని పరిస్థితి ఉండదు. లాంగ్ వీకెండ్ వస్తే మరింత హ్యాపీ. అందువల్ల.. లాంగ్ వీకెండ్ హాలీడేస్ ఆలోచనను లైట్ తీస్కుని అవకాశం ఉన్న సమయంలో సెలవులను ఎంజాయ్ చేస్తే సరిపోతుంది.