తిరుమల: ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న క్రమంలో ఎలాంటి సిఫారస్సు లేఖలు స్వీకరించబడవని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనం, వసతి కోసం తిరుమలలో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది.
స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించడం జరుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ( ఎన్నికల ప్రవర్తనా నియమావళి ) ఉన్నంత వరకు ఇది వర్తిస్తుందని గుర్తుచేశారు. అందువల్ల.. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.
