యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఐదో యూనిట్ ట్రయల్ రన్ సక్సెస్

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఐదో యూనిట్ ట్రయల్ రన్ సక్సెస్

నల్లగొండ: దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఐదో యూనిట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇప్పటికే ప్లాంట్‌లో నాలుగు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. జెన్కో అధికారులు తాజాగా ఐదో యూనిట్ ట్రయల్ రన్ పూర్తి చేశారు. వచ్చే నెల నాటికి ఐదు యూనిట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అధికారులు చర్యలు చేపట్టారు.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపల్లిలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు యూనిట్లతో మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యమున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌‌‌‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం రూ.37 వేల కోట్లను దాటింది. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) పలు పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది.

ALSO READ : రికార్డు సమయంలో కృష్ణా ఫేజ్‌-2 ఎయిర్ వాల్వ్ పునరుద్ధరణ..

అయితే, బొగ్గు సరఫరా వ్యవస్థ, సీహెచ్‌‌‌‌పీ, ఏహెచ్‌‌‌‌పీ నిర్మాణాల్లో నాణ్యత లోపించినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం 800 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లలో, మొత్తం 3,200 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఐదో యూనిట్ పనులు పెండింగ్‌‌‌‌లో ఉండటంతో అది ఇంకా ప్రారంభం కాలేదు. ఐదో యూనిట్ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో.. ఐదో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి అధికారులు సిద్ధమవుతున్నారు.