- ఇప్పటికే మూడు రెట్ల సబ్‌స్క్రిప్షన్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ రూ.30,213 కోట్ల ఐపీఓ మార్కెట్లో కొత్త రికార్డు సృష్టించింది. బుధవారం సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన కేవలం గంటన్నరలోనే వంద శాతం బిడ్లు దాఖలయ్యాయి. సాయంత్రం 5 గంటల సమయానికి 3.01 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.
మొత్తం 19.75 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా, ఏకంగా 59.44 కోట్ల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. రూ.1,119 గరిష్ట ధర వద్ద వచ్చిన పబ్లిక్ బిడ్ల విలువ సుమారు రూ.66,500 కోట్లు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన రూ.8,110 కోట్లతో కలిపి మొత్తం డిమాండ్ రూ.74,610 కోట్లకు చేరింది.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల విభాగం 9.02 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 1.58 రెట్లు, రిటైల్ విభాగం 0.68 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. ఉద్యోగుల కోటా 1.30 రెట్లు, షేర్‌హోల్డర్ల కోటా 1.38 రెట్లు నిండాయి. ఐపీఓ శుక్రవారం
ముగుస్తుంది.
