డీఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్.. రూ.40 లక్షల బదిలీ వ్యవహారంలో పట్టుబడిన అధికారులు

డీఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్.. రూ.40 లక్షల బదిలీ వ్యవహారంలో పట్టుబడిన అధికారులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. పీఎం కృషి సించాయ్ యోజన పనుల్లో 39 లక్షల14 వేల రూపాయల బదిలీ వ్యవహారంపై  వచ్చిన ఫిర్యాదు మేరకు 2026 అక్టోబర్ 22న తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో టెక్నికల్ అధికారి రాజు, ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నా ఏసీబీ అధికారులు. కోటి 62 లక్షల పనులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు. 

ALSO READ : కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరిపించండి

కోట్ల అవినీతి జరిగిందనే ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఉద్యోగులలో  ఆందోళన మొదలైంది. పనులకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.