జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం (నవంబర్ 6, 2026) రాత్రి తూర్పు తీరానికి సమీపంలోని సముద్ర ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:39 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించింది. రాజధాని టోక్యోతో పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.
జపాన్ తూర్పు తీరానికి సమీపంలోని పసిఫిక్ సముద్ర ప్రాంతం భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని JMAఅధికారులు వెల్లడించారు.భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో 6.1 ప్రకంపనల తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఎక్కడెక్కడ ప్రకంపనలు వచ్చాయి..
జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం మియాగి, ఫుకుషిమా, ఇబరాకి ప్రిఫెక్చర్లలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. రాజధాని టోక్యో మధ్య ప్రాంతంలోనూ భూమి కంపించినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం.
సునామీ ముప్పు ఉందా? నష్టం ఎంత?
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న అధికారిక, అంతర్జాతీయ నివేదికల్లో సునామీ హెచ్చరికపై స్పష్టమైన సమాచారం లేదు. అలాగే ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
