మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఎస్‌ఐ శ్రీనివాస్.. అదే మొత్తాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఎస్‌ఐ శ్రీనివాస్ బాధితుడిని రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నాగారం పరిధిలోని శిల్పా నగర్‌లో లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్‌ఐను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎస్‌ఐ శ్రీనివాస్‌ను కీసర పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఒకే స్టేషన్‌లో వరుస అవినీతి ఆరోపణలు!
కీసర పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం వ్యవహారాలు వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇదే పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువకముందే, తాజాగా మరో ఎస్‌ఐ లంచం కేసులో చిక్కుకోవడం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.
