ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్. వివిధ క్రెడిట్ కార్డ్‌లపై ఇస్తున్న ఉచిత ప్రయోజనాలను నిలిపివేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 15 నుంచి క్రెడిట్ కార్డ్‌లపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజ్, మూవీ టికెట్ బెనిఫిట్స్‌ను పూర్తిగా తొలగించనుంది. అంతేకాకుండా కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జీలు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఫీజులను కూడా భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు రిటైల్, బిజినెస్, కార్పొరేట్ కార్డ్హోల్డర్లపై ప్రభావం చూపనున్నాయి.
కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జీల పెంపు..
డిసెంబర్ 11 నుంచి క్రెడిట్ కార్డ్‌ల రీప్లేస్మెంట్ ఫీజును రూ.200 నుంచి రూ.300కు పెంచుతున్నారు. అంటే ఇది నేరుగా 50 శాతం పెంపు అన్నమాట. అయితే ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, 1838 రిజర్వ్, టైమ్స్ బ్లాక్ క్రెడిట్ కార్డ్‌లకు మాత్రం ఈ పెంపు నుంచి మినహాయింపునిచ్చారు.
ఇదే తేదీ నుంచి ప్రయారిటీ పాస్ కార్డ్‌ల రీప్లేస్‌మెంట్‌కు కూడా ఫీజు వర్తింపజేస్తున్నారు. ఇప్పటివరకు ఉచితంగా లభించిన దీనికి ఇకపై రూ. 300 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమరాల్డ్, సఫిైరో, మేక్మైట్రిప్, ఎమిరేట్స్ స్కైవార్డ్స్ లాంటి ప్రీమియం కార్డ్హోల్డర్లపై ఈ ప్రభావం పడనుంది.
ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ రద్దు..
కొన్ని ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఇస్తున్న ఉచిత ఇన్సూరెన్స్ కవర్లను డిసెంబర్ 15, 2026 నుంచి నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.
1. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్: ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్, డైమండ్, సఫిైరో, రూబీఎక్స్ (Rubyx) కార్డ్‌లపై ఈ సౌకర్యం నిలిచిపోతుంది.
2. క్యాన్సిలేషన్ కవర్: ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, టైమ్స్ బ్లాక్, ఎమరాల్డ్ కార్డ్‌లపై రద్దు చేయబడుతుంది.
అలాగే పరాక్రమ్, పరాక్రమ్ సెలెక్ట్ కార్డ్‌లపై ఇస్తున్న పర్సనల్ అండ్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా రద్దు కానుంది.
ఐనాక్స్ మూవీ బెనిఫిట్స్ కట్..
క్రెడిట్ కార్డ్‌లపై వినియోగదారులకు అందుతున్న ఉచిత ఐనాక్స్ మూవీ ఆఫర్‌ను కూడా డిసెంబర్ 15 నుంచి తొలగిస్తున్నారు. రూబీఎక్స్, కోరల్, ఎక్స్ప్రెషన్స్, చెన్నై సూపర్ కింగ్స్, మేక్మైట్రిప్ ప్లాటినం, హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ వంటి వివిధ కార్డ్‌లను వాడుతున్న వారికి ఇకపై ఈ సినిమా ఆఫర్లు వర్తించవు.
►ALSO READ | టెక్కీలకు యాక్సెంచర్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు భారీ బోనస్!
బిజినెస్ కార్డ్‌లపై ఫీజుల మోత..
నవంబర్ 25, 2026 నుంచి సెలెక్టెడ్ బిజినెస్, కార్పొరేట్, పర్చేజ్ క్రెడిట్ కార్డ్‌లపై డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఫీజును 1 శాతం నుంచి ఏకంగా 3.50 శాతానికి పెంచుతున్నారు. విదేశాల్లో, విదేశీ సంస్థల్లో రూపాయల్లో జరిపే లావాదేవీలపై ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వివిధ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్చేస్తున్న వేళ కస్టమర్లు తాము వాడుతున్న కార్డు ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు చేశారో ముందుగా పరిశీలించటం మంచిది. ఐసీఐసీఐ కార్డుల ద్వారా విదేశీ పేమెంట్స్ చేసే వారు మార్కప్ చార్జీలను పరిశీలించాకే చెల్లించులు చెయటం మంచిది.
