యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు మాతృవియోగం

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు మాతృవియోగం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి(91)కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం(నవంబర్20) ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా, యమకేశ్వర్ బ్లాక్‌లోని స్వగ్రామం పంచూర్‌ లో ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్తను యోగి ఆదిత్యనాథ్ సోదరుడు మహేంద్ర ధృవీకరించారు. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆసుపత్రికి వెళ్లి తల్లిని పరామర్శించారు.తాజాగా ఆమె కన్నుమూయడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.హరిద్వార్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.