ఊహించని ప్రమాదం.. విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఊహించని ఘటన పిక్నిక్ కోసం వెళ్లిన విద్యార్థులను కబలించింది. అప్పటి వరకు కేరింతలు కొడుతూ సందడిగా ఉన్న ఆప్రాంతమంతా ఒక్కసారి విద్యార్థుల అరుపులు ఏడుపులతో మార్మోగింది. విహార యాత్రకు వెళ్లిన 8మంది విద్యార్థులు బీచ్ లో గల్లంతైన ఘటన మహారాష్ట్రలోని పూణె బీచ్ లో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పూణేకు చెందిన విద్యార్థులు పిక్నిక్ కోసం వెళ్లిన ఎనిమిది మంది విద్యార్థులు దివేగర్ బీచ్‌లో మునిగిపోయారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. పూణే జిల్లా అలంది నుంచి విన్నర్స్ అకాడమీకి చెందిన 42 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులతో కలిసి దివేగర్‌కు పిక్నిక్‌కు వెళ్లారు. ఈ బృందంలో 25 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. 11, 12వ తరగతులకు చెందిన విద్యార్థులు పిక్నిక్‌లో పాల్గొన్నారు.
బీచ్‌కు చేరుకున్న సమయంలో 11వ తరగతి చదువుతున్న 8మంది విద్యార్థులు సముద్రంలోకి వెళ్లారు. అయితే నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. 8మంది విద్యార్థుల మృతదేహాలను వెలికితీసి పోస్ట్ మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై మహారాష్ట్ర మంత్రులు భరత్ గోగావాలే, అదితి తట్కరే అధికారులను అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ రాయ్‌గడ్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రక్షణ, సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆమె, వారికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
మృత విద్యార్థుల పూర్తి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
