ప్రముఖ వెబ్ సిరీస్ నటి అరెస్ట్ : వ్యభిచార ముఠా లీడర్ గా పోలీసులు గుర్తింపు

ప్రముఖ వెబ్ సిరీస్ నటి అరెస్ట్ : వ్యభిచార ముఠా లీడర్ గా పోలీసులు గుర్తింపు

థానేలో గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నారనే సమాచారంతో  ఒక ప్రముఖ వెబ్ సిరీస్, భోజ్‌పురి నటిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అసాంఘిక కార్యకలాపాలల్లో చిక్కుకున్న ఇద్దరు మహిళలను పోలీసులు క్షేమంగా రక్షించారు.

వివరాల ప్రకారం... థానే క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTC) అధికారులకు నగరంలో అసాంఘిక కార్యకలాపాల దందా  నడుస్తోందని పక్క సమాచారం అందింది. దింతో సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంజలి ఆంధ్లే ఆధ్వర్యంలోని పోలీసు బృందం పథకం ప్రకారం ఒక్కసారిగా రైడ్ చేసింది.  

భోజ్‌పురి నటి ఇద్దరు మహిళలను అసాంఘిక కార్యకలాపాల్లోకి  దింపేందుకు  ప్రయత్నిస్తుండగా, పోలీసులు రంగంలోకి దిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడున్న ఇద్దరు మహిళలను రక్షించి సేఫ్ హోమ్‌కు తరలించారు.

హిందీ, భోజ్‌పురి సినిమాల్లో నటన:
అరెస్టయిన నటి పలు హిందీ, భోజ్‌పురి సినిమాల్లో నటించడమే కాకుండా, 10కి పైగా ప్రముఖ వెబ్ సిరీస్‌లలో నటించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, నిబంధనల ప్రకారం పోలీసులు ఆమె వివరాలను మీడియాకు వెల్లడించలేదు.

భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లతో పాటు, పిటా (PITA - అనైతిక రవాణా నివారణ చట్టం) కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరైనా ప్రముఖులు ఉన్నారా ? అనే కోణంలో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే  ప్రముఖ ఓటీటీ, భోజ్‌పురి నటి అరెస్టు కావడం సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.