మకర రాశి వారికి అక్టోబరు నెల చాలా సానుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం, ఆర్థికంగా ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కలసివస్తాయి, లాభాలు పెరుగుతాయి.
అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అక్టోబర్లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు
- అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 17: తులారాశిలోకి సూర్యుడు
- అక్టోబర్ 24: తులారాశిలో బుధుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నెలలో ( 2026 అక్టోబర్) శుక్రుడు.. సూర్యుడు..బుధుడు గ్రహాల సంచారంలో జరిగే మార్పుల వలన లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య యోగం, బుధాదిత్యయోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. పాత రుణాలు తీరిపోతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం మంచిది.
అక్టోబర్ నెలలో ఈ రాశి వారి జాతకంలో 10వ స్థానంలో సూర్యుడి సంచారం కారణంగా టైం తెలియకుండా పనిచేసే అవకాశం ఉంది. 7వ ఇంట్లో కుజుని సంచారం కారణంగా ఇతరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 3వ ఇంట్లో శని వక్రగతిలో సంచారం వలన అకాల భోజనం.. నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి వారికి అక్టోబర్ నెల అపూర్వమైన ఆనందాన్ని, ఆర్థిక లాభాలను అందిస్తుంది. తులారాశిలో బుధ, శుక్ర గ్రహాల తిరోగమన సంచారం వలన ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. చేతి పనివారికి ఎంతో కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.గత ప్రయత్నాలను సద్వినియోగం చేసుకోవడానికి, కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి, వృత్తిపరమైన పరిచయాలను పునరుద్ధరించుకోవడానికి అవకాశాలు లభిస్తాయి.
ALSO READ : గ్రహాల మార్పు ప్రభావం. అక్టోబర్ నెల ధనస్సు రాశి వారికి అవకాశాల పండుగ..!
వ్యాపారంలో అధికంగా లాభాలు వస్తాయి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీరు ఆర్థికంగా గొప్ప పురోగతిని చూస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం, సామరస్యం రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.శుక్ర, బుధ గ్రహాల తిరోగమనం కారణంగా, సంభాషణలో మితంగా వ్యవహరించాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. , తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకోవడం చాలా అవసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
చేయాల్సిన పరిహారాలు
- శనివారం ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయించడం
- ప్రతిరోజూ శివ పంచాక్షర మంత్రాన్ని "ఓం నమః శివాయ్" జపించండి.
- ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయండి
- ప్రతి శనివారం శనిదేవుని పేరు మీద నల్ల నువ్వులు లేదా ఆవ నూనె దానం చేయండి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
