ధనస్సు రాశి వారికి ఈ నెల ( అక్టోబర్ 2026) కొత్త అవకాశాల పండుగగా మారనుంది. అన్ని రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి శుభప్రదమైన నక్షత్రాలు తోడుగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష్య నిపుణులు తెలిపి న వివరాల ప్రకారం 2026 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ధనస్సు రాశి వారికి అక్టోబర్ నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. నెల ప్రథమార్థంలో కొంత శ్రమ ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో శుభ ఫలితాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో అధికారులతో మాట్లాడేటప్పుడు సహనం చాలా అవసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రమోషన్ లేదా స్థానచలనం కోసం చూస్తున్న వారికి నెల చివర్లో సానుకూల వార్తలు అందుతాయి.
అక్టోబర్ మాసంలో అనేక పండుగలు ప్రారంభం కావడంతో చాలా గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ నెలలో ( 2026 అక్టోబర్) గ్రహాలు, నక్షత్రాలు సంచారంలో అనేక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అక్టోబర్లో గ్రహాల స్థాన చలనం మార్పుల వివరాలు
- అక్టోబర్ 3: తులారాశిలో శుక్రుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 17: తులారాశిలోకి సూర్యుడు
- అక్టోబర్ 24: తులారాశిలో బుధుడు వక్రగతి సంచారం
- అక్టోబర్ 31: సింహరాశిలోకి గురుడు
అక్టోబర్ 17వ తేదీ తర్వాత, సమావేశాలు మరియు కార్యక్రమాలు తరచుగా జరుగుతాయి. 4వ ఇంట్లో వక్రించిన శని కారణంగా ఆందోళన పడే అవకాశాలున్నాయి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు లేదా హెర్బల్ టీ తాగడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం ఆందోళన తగ్గుతుంది.
11 వ ఇంట్లో శుక్రుడు వక్రగతిలో సంచారం వలన ఈ రాశి వారికి ఎంతో కావలసిన వారు పాత స్నేహితులు కలుస్తారు. శుక్ర, బుధ గ్రహాల తిరోగమనం కారణంగా ఇతరులతో అనవసరంగా చర్చించవద్దు.బుధుడు వక్రగతిలో సంచారం వలన సామాజికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నాలుగో ఇంట్లో శని వక్రగతిలో ఉండటం వలన ఇంటి బాధ్యతలు భారంగామారే అవకాశం ఉంది.ఇంట్లో ఓర్పు వహించడం వలన భావోద్వేగ సమతుల్యత కొనసాగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వ్యాపారంలో మీకు ఊహించని లాభాలు లభించవచ్చు. పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలను చేకూర్చే కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. పరిశ్రమలోని అనుభవజ్ఞులైన నిపుణుల నుండి మీకు మార్గదర్శకత్వం లభించవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన పోలీసు, న్యాయవాద, రాజకీయ, వ్యవసాయ రంగాలలో ఉన్నవారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మీ కెరీర్‌లో అభివృద్ధిని చూస్తారు. డబ్బు లావాదేవీలు భారీ లాభాలను తెస్తాయి. కొంతమందికి కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా ఈ నెలలో దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి
ALSO READ : అక్టోబర్ లో కీలక గ్రహాలు మార్పు.. వృశ్చికరాశి వారికి లాభమా.. నష్టమా..
ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాబడికి మించి ఖర్చు చేయకుండా చూసుకోవడం మంచిది. పూర్వీకుల ఆస్తుల విషయాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా సర్దుమణుగుతాయి. స్నేహితుల మద్దతు లభిస్తుంది.
కంటి సమస్యలు లేదా అలసట ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార అలవాట్లపై దృష్టి పెట్టడం అవసరం. ధనుస్సు రాశి వారికి ఈ నెల జాతకం ప్రకారం, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.
చేయాల్సిన పరిహారాలు:
- ప్రతి గురువారం, "ఓం బృహస్పతయే నమః" అనే మంత్రాన్ని జపం చేయండి
- విష్ణుమూర్తికి పసుపు బంతి పువ్వులను సమర్పించండి.
- ఇంటి పెద్దలతో, గురువులతో మర్యాదగా మాట్లాడి వారి ఆశీర్వాదం పొందండి.
- పేదలకు అన్నదానం చేయండి.
- గురువారం రోజున దక్షిణామూర్తి స్త్రోత్రం పారాయణం చేయండి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
