ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్‌బీఐ సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక గెజిట్ నోటిఫికేషన్ పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) ఫాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం పేరుతో సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్ నకిలీదని, కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని స్పష్టం చేసింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకులు ప్రతినెలా రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవులను కలిగి ఉంటాయి. మొదటి, మూడు, ఐదు శనివారాలు పని దినాలుగా కొనసాగుతాయి. అయితే బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల ప్రతినిధి అయిన 'యూనిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' గత కొన్ని సంవత్సరాలుగా వారానికి 5 రోజుల వర్కింగ్ కావాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. 2015లో 10వ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం రెండో, నాలుగో శనివారాలను సెలవులుగా ప్రకటించి ఈ డిమాండ్‌ను పాక్షికంగా అంగీకరించింది. అప్పటి నుంచి మిగిలిన శనివారాలకు కూడా సెలవులు ప్రకటించాలని యూనియన్లు కోరుతూనే ఉన్నాయి.
A Gazette circulating on social media , purportedly issued by the Ministry of Finance (Department of Financial Services), claims that the Central Government has declared every Saturday a public holiday for all Public Sector Banks , including SBI. #PIBFactCheck: ❌ The document being circulated is #Fake. ✅ No such notification has been issued by @FinMinIndia declaring every Saturday as public holiday for public sector banks. 💡 Flag suspicious content related to the Central Government to PIB Fact Check. 📱 WhatsApp: +91 8799711259 📧 [email protected]
— PIB Fact Check (@PIBFactCheck) October 1, 2026
బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్ల నేపథ్యంలో.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఇటీవల ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 5 రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయడంపై చర్చించి త్వరలోనే తన నివేదికను సమర్పించనుంది. ఈ సిఫార్సుల ఆధారంగా RBI, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫైనల్ నిర్ణయం తీసుకుని చట్టపరమైన మార్పులు చేయనున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ నమ్మవద్దని అధికారులు సూచించారు.
