పెబ్బేరు ఫిషరీస్‌‌‌‌ స్టూడెంట్స్కు జాతీయ ర్యాంకులు

పెబ్బేరు ఫిషరీస్‌‌‌‌ స్టూడెంట్స్కు జాతీయ ర్యాంకులు


పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు ఫిషరీస్‌‌‌‌ కాలేజీ విద్యార్థులు జాతీయ స్థాయి పీజీ ప్రవేశ పోటీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఏటా ఐసీఏఆర్‌‌‌‌–ఏఐఈఈఏ నిర్వహించే ఈ పరీక్షల్లో 2025–26 సంవత్సరానికి పెబ్బేరు కళాశాల విద్యార్థులు టాప్‌‌‌‌ 30లో వరుసగా నాలుగు ర్యాంకులు సాధించారు. టి. వైష్ణవి 10వ ర్యాంకు, పి.శారోన్‌‌‌‌ దివ్య 11వ ర్యాంకు, ఎ.శ్రీకర్‌‌‌‌ 19వ ర్యాంకు, వి.అక్షర 27వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్‌‌‌‌ డీన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ సకారామ్‌‌‌‌తో పాటు ప్రొఫెసర్లు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.