రెడ్‌మి నోట్ 17 ప్రో సిరీస్‌లో భాగంగా, షియోమి ఇండియాలో రెడ్‌మి 17సి 5జిని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.9-అంగుళాల HD+ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, IP64 రేటింగ్ ఉన్నాయి.
రెడ్‌మి 17సి మోడళ్లు & ధరలు:
4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999, 6GB RAM + 128GB స్టోరేజ్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. డార్క్ నైట్, కాఫీ బ్రూ, పర్పుల్ డాన్ కలర్స్ లో వస్తుండగా... ఈ ఫోన్ వెనుక భాగం వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. సేల్స్ అక్టోబర్ 7న మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమై.. Amazon.in, Xiaomi ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
డిస్‌ప్లే స్క్రీన్ సైజ్ 6.9-అంగుళాలతో HD+ LCD డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. దీనివల్ల ఫోన్ వాడేటప్పుడు, స్క్రోల్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. సాధారణంగా 660 నిట్స్, ఎండలో వాడేటప్పుడు (High Brightness Mode) 810 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఇస్తుంది. కళ్ళపై ఒత్తిడి పడకుండా కంటికి రక్షణనిచ్చేలా (TÜV Rheinland) సర్టిఫికేషన్ ఉంది.
పెర్ఫార్మన్స్ & సాఫ్ట్‌వేర్
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300 5G - 6nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది రోజు వాడకానికి, గేమింగ్, యాప్స్ వాడకానికి బాగా సరిపోతుంది. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ అందించారు. ఈ ఫోన్ కంపెనీకి చెందిన HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
బ్యాటరీ & ఛార్జింగ్
బ్యాటరీ కెపాసిటీ భారీ 6,000mAh బ్యాటరీ ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 90 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుందని, ఒకసారి ఛార్జ్ చేస్తే వరుసగా 105 గంటల వరకు పాటలు వినవచ్చని కంపెనీ చెబుతోంది.
కెమెరా & ఇతర ఫీచర్లు
బ్యాక్ కెమెరా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఒక Auxiliary లెన్స్ ఉంది. ఇందులో నైట్ మోడ్, పోర్ట్రెయిట్, HDR మోడ్స్ ఇంకా Full HD వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
ఇతర ఫీచర్లలో నీటి తుంపరలు, దుమ్ము నుండి రక్షణ కోసం IP64 రేటింగ్, పాటలు వినడానికి 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 211 గ్రాములు ఉంటుంది.
