వన్డే వరల్డ్ కప్–2027 షెడ్యూల్ వచ్చేసింది.. పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ ఎప్పుడంటే..

వన్డే వరల్డ్ కప్–2027 షెడ్యూల్ వచ్చేసింది.. పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ ఎప్పుడంటే..

టీమిండియా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే వరల్డ్ కప్-2027 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 7న టీమిండియా తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. అక్టోబర్ 10, 2027న ఆదివారం రోజున టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. గ్రూప్-ఏలో ఆప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్, జింబాబ్వే జట్లు ఉండగా.. గ్రూప్-బీలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.

అక్టోబర్ 2, 2027 శనివారం రోజున.. క్వాలిఫయర్ మ్యాచులతో మొదలై.. నవంబర్ 21, 2027న జోహెన్స్బర్గ్లో జరిగే ఫైనల్ మ్యాచ్తో వరల్డ్ కప్ ముగుస్తుంది. అంటే.. 50 రోజుల పాటు క్రికెట్ లవర్స్కు పండగనే అని చెప్పాలి. ఇక.. టీమిండియా మ్యాచులకు సంబంధించి ఫుల్ షెడ్యూల్  ఏంటంటే..

* అక్టోబర్ 7 (టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా)
* అక్టోబర్ 10 (టీమిండియా వర్సెస్ పాకిస్తాన్)
* అక్టోబర్ 14 (టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్)
* అక్టోబర్ 17 (టీమిండియా వర్సెస్ క్వాలిఫయర్-A)
* అక్టోబర్ 24 (టీమిండియా వర్సెస్ జింబాబ్వే)

The #CWC27 groups are locked ⚡🔐

A cricketing extravaganza awaits! How to watch the schedule launch ➡️ https://t.co/Eod5GoN7zW pic.twitter.com/oVg7zVHLNF