పాక్ను పడగొట్టి.. ఆసియా క్రీడల్లో ఫైనల్‌‌కు చేరిన ఇండియా

పాక్ను పడగొట్టి.. ఆసియా క్రీడల్లో ఫైనల్‌‌కు చేరిన  ఇండియా

ఆసియా క్రీడల్లో ఇండియా మెన్స్‌‌ హాకీ జట్టు ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్‌‌లో ఇండియా 4–3 తేడాతో పాకిస్తాన్‌‌పై విజయం సాధించింది. మ్యాచ్‌‌ ఆరంభంలో ఇండియా ఆధిపత్యమే కొనసాగింది. కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ (5, 13వ నిమిషం౦ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌‌గా మల్చగా, సుఖ్‌‌జీత్‌‌ సింగ్‌‌ (23వ ని) ఫీల్డ్‌‌ గోల్డ్‌‌ కొట్టాడు.

దీంతో ఇండియా 3–0తో తొలి హాఫ్‌‌ను ముగించింది. సెకండాఫ్‌‌లో అబూ మహమూద్‌‌ (30వ ని), హన్నన్‌‌ షాహిద్‌‌ (45వ ని), వహీద్‌‌ రాణా (49వ ని) గోల్స్‌‌ చేసి స్కోరును 3–3తో సమం చేశారు. దాంతో మ్యాచ్‌‌ డ్రా అనుకున్న టైమ్‌‌లో అభిషేక్‌‌ అద్భుతం చేశాడు. కేవలం 45 సెకన్లు మిగిలి ఉన్న టైమ్‌‌లో అభిషేక్‌‌ ఫీల్డ్‌‌ గోల్డ్‌‌తో చిరస్మరణీయ విజయం అందించాడు. శనివారం జరిగే స్వర్ణ పతక పోరులో మలేషియాతో ఇండియా తలపడనుంది.