ఏషియాడ్ సెపక్‌తక్రాలో ఇండియా మెన్స్ టీమ్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. క్వార్టర్‌ఫైనల్లో ఇండియా 2–1 (10–15, 15–13, 15–7)తో మయన్మార్‌పై గెలిచి క్వాడ్రాంట్ సెమీస్‌లోకి ప్రవేశించింది. షూటింగ్‌లో మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో అనీష్ భన్వాలా ఏడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు.
ఫైనల్లో 15 షాట్లలో 11 హిట్స్‌తో ముగించాడు. మూడో ప్లేస్‌కు సరిపోయే పెర్ఫామెన్స్ చూపెట్టినా.. తక్కువ క్వాలిఫికేషన్ స్కోరు కారణంగా టైబ్రేక్‌లో ఓడిపోయి ఏడో ప్లేస్‌కు పరిమితమయ్యాడు. టెన్నిస్‌లో ఇండియా ప్లేయర్లు నిరాశపర్చారు.
సుమిత్ నగాల్ క్వార్టర్స్‌లో ఓడటంతో 40 ఏళ్ల తర్వాత పతకం లేకుండా ఇండియా టోర్నీని ముగించింది. సుమిత్ 4–6, 4–6తో యిబింగ్ వు (చైనా) చేతిలో ఓడాడు.
