జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత ఆర్చరీ జట్టు అదరగొడుతోంది. మహిళల టీమ్ రికర్వ్ ఆర్చరీలో భారత్ మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్లుగా నిలిచిన కొరియాజట్టును ఓడించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత మహిళల జట్టు చైనాపై 5–1తో ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు ఫైనల్ లో దక్షిణ కొరియాను ఓడించింది. అంకితా భకత్, కీర్తి, కుంకుమ్ అనిల్ మొహోద్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ఫైనల్‌లో దక్షిణ కొరియాను 5-3 తేడాతో ఓడించి చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
ఏషియన్ గేమ్స్ 2026లో ఆర్చరీలో భారత్ ఇప్పటికే అద్భుత ప్రదర్శన చేసింది. సెప్టెంబర్ 30న జరిగిన కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లలో భారత్ మహిళల, పురుషుల, మిక్స్‌డ్ విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. మహిళల కాంపౌండ్ జట్టు చైనాను 238–234తో ఓడించి స్వర్ణం గెలవడమే కాకుండా ప్రపంచ రికార్డును సమం చేసింది. పురుషుల జట్టు చైనాపై 238–237తో, మిక్స్‌డ్ జట్టు దక్షిణ కొరియాపై షూట్‌ఆఫ్‌లో విజయం సాధించాయి.
