మందమర్రిలో సహారా బాధితుల ధర్నా.. డిపాజిట్ల సొమ్ము వడ్డీతో చెల్లించాలని డిమాండ్

మందమర్రిలో సహారా బాధితుల ధర్నా.. డిపాజిట్ల సొమ్ము వడ్డీతో చెల్లించాలని డిమాండ్

ల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు: సహారా ఇండియా సంస్థలో డబ్బులు దాచుకుని, మెచ్యూరిటీ కాలం ముగిసినా తమ సొమ్ము తిరిగి రాకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సహారా కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. తమ కష్టార్జితాన్ని వెంటనే వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్​ చేశారు. సహారా సంస్థలో కోట్లాది మంది పెట్టుబడులు పెట్టారని బాధితులు తెలిపారు.

సుప్రీంకోర్టు 2015లో 15 శాతం వడ్డీతో బాధితులకు వారి డిపాజిట్‌‌‌‌ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా.. ఇంతవరకు పట్టించుకునే నాథులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని విమర్శించారు. సెంట్రల్‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ సొసైటీ ద్వారా దేశంలోని ప్రతి ఖాతాదారుడికి చెల్లింపులు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్‌‌‌‌షా గతేడాది జులైలో ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు బాధితులకు ఎలాంటి చెల్లింపులు జరగలేదన్నారు. కేంద్రం వెంటనే చర్యలు తీసుకుని తమ డిపాజిట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ధర్నాలో వివిధ జిల్లాల నుంచి బాధితులు పాల్గొన్నారు.