నమ్మకానికి.. మూఢనమ్మకానికి మధ్య సాగే కథ.. క్లైమాక్స్ను ఊహించలేరు 

నమ్మకానికి.. మూఢనమ్మకానికి మధ్య సాగే కథ.. క్లైమాక్స్ను ఊహించలేరు 

దినేష్‌‌‌‌ తేజ్‌‌‌‌, దష్విక.కె జంటగా అర్జున్‌‌‌‌ కోలా తెరకెక్కించిన చిత్రం ‘తత్వం’. శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటి నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దినేష్ తేజ్ మాట్లాడుతూ ‘ఇదొక మర్డర్ మిస్టరీ  థ్రిల్లర్.  మూఢనమ్మకానికి, నమ్మకానికి మధ్య ఉండే సన్నని గీత చుట్టూ ఈ కథ సాగుతుంది. 2000 సంవత్సరంలో జరిగే కథ.  కథలో ఎవరూ ఊహించలేని ట్విస్టులు, క్లైమాక్స్‌‌‌‌లో ఉండే ఎమోషన్ నాకు బాగా నచ్చాయి.  

నటుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఇది.  ఇలాంటి కథలు చేయడం వల్ల ప్రేక్షకుల్లో మంచి గౌరవం వస్తుందని భావిస్తున్నా.   కమర్షియల్ సక్సెస్ ఒక్కటే లక్ష్యంగా ఈ సినిమా చేయలేదు. కథ చెప్పాలని అనిపించి, నావెల్టీ ఉందని నమ్మి చేశాను.  ప్రస్తుతం ‘హుషారు-2’తో పాటు విజయనగరం బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా చేస్తున్నా’ అని చెప్పాడు.