అక్టోబర్ 1 కొత్త నెల ప్రారంభం రోజునే బులియన్ మార్కెట్లు నేలచూపులతో ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి. బంగారం, వెండి రేట్లు తగ్గుదలతో సామాన్య కొనుగోలుదారులు ఊరట పొందుతున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వారు ముందుగా తమ నగరాల్లోని తగ్గిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్.
అక్టోబర్ 1న బంగారం రేట్లు తగ్గాయి. సెప్టెంబర్ 30 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.33 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 924గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 680గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 1, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 35వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.235 దగ్గర ఉంది.
