ఏపీ హైకోర్టు తీర్పు బాధాకరం: ఆర్ కృష్ణయ్య

ఏపీ హైకోర్టు తీర్పు బాధాకరం: ఆర్  కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్  కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాజ్యాంగ సవరణ శాశ్వత పరిష్కారమని తెలిపారు.

ఇందుకోసం సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు. గురువారం రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరిపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.