రాష్ట్రంలో ప్రత్యేక TG TET నోటిఫికేషన్ను విద్యా శాఖ జారీ చేసింది. తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండో విడత టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వ, స్థానిక సంస్థలు, TGREIS, ప్రభుత్వ సంక్షేమ గురుకుల సొసైటీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని.. నవంబర్ 16 నుంచి 21 వరకు ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. అక్టోబర్ 7 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ప్రకటించిన తెలంగాణ పాఠశాల విద్యా శాఖ, schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచింది.
