నిజామాబాద్ జిల్లా పామాయిల్‌ రైతులకు గుడ్ న్యూస్.. నందిపేట సెజ్‌‌‌‌‌‌‌‌లో పామాయిల్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ నిర్మిస్తం

నిజామాబాద్ జిల్లా  పామాయిల్‌ రైతులకు గుడ్ న్యూస్.. నందిపేట సెజ్‌‌‌‌‌‌‌‌లో  పామాయిల్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ నిర్మిస్తం
  •    గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ సలహాదారుడు సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌‌‌‌‌‌‌‌లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ సలహాదారుడు సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నిర్మల్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలకు మధ్యలో అనువుగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 17 వేల ఎకరాల్లో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగవుతోందన్నారు. 

ఇక్కడ ఫ్యాక్టరీని నిర్మిస్తే రెండు జిల్లాల రైతులకు అందుబాటులో ఉంటుందని, దీని వల్ల ఆయిల్ పామ్ విస్తీర్ణం మరో 5 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందన్నారు. బుధవారం రూరల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్ ‌‌‌‌మిశ్రాతో కలిసి సెజ్‌‌‌‌‌‌‌‌ లో స్థల పరిశీలన చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వర‌‌‌‌రావుతో శంకుస్థాపన చేయిస్తామని ప్రకటించారు. 

రైస్‌‌‌‌‌‌‌‌ బ్రాన్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌, సోయా పరిశ్రమలను సైతం ఇక్కడికే తీసుకొస్తామని చెప్పారు. ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌‌‌‌‌‌‌‌, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ సభ్యుడు గడుగు గంగాధర్‌‌‌‌‌‌‌‌, అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రాజాగౌడ్‌‌‌‌‌‌‌‌, ఆర్మూర్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అభిగ్యాన్‌‌‌‌‌‌‌‌ మాల్వియ, ఆర్డీవో రాజేంద్రకుమార్‌‌‌‌‌‌‌‌
 పాల్గొన్నారు.