బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. మయన్మార్-అండమాన్ మధ్య బంగాళాఖాతంలో ఈ వాయుగుండం ఏర్పడింది. ఇది వచ్చే 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ వాయుగుండం తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణం కేంద్ర నిపుణులు తెలిపారు.

తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండటంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.