మహాలయ పక్షాలు కొనసాగుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. శుభ గ్రహమైన శుక్రుడు ధనం, కీర్తి, ప్రేమ, సౌందర్యం, భాగస్వామ్యం, మేధోపరమైన ఆనందం, శ్రేయస్సుకు ప్రతీక అయిన శుక్రుడు అక్టోబర్ 3న మధ్యాహ్నం 12:45 గంటలకు తన సొంత రాశి అయిన తులారాశిలో వక్రగతి (వెనక్కు) సంచారాన్ని ప్రారంభిస్తాడు. 42 రోజుల పాటు అంటే నవంబర్ 14 వరకు ఇదే స్థితిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తులారాశిలో శుక్రుడు తిరోగమనం వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!
మేష రాశి: శుక్రుడు తులారాశిలో తిరోగమనంలో సంచారం వలన ఈ రాశి వారికి
అద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కెరీర్‌లో పెద్ద టార్గెట్ సాధన లేదా మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచిపెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభ రాశి : శుక్రుడు తులారాశిలో వక్రగతిలో సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కీలక బాధ్యతలు పోషించాల్సి ఉంటుంది. కాని తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కార్యాలయంలో ఉన్నతాధికారులు అండదండలు పుష్కలంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు, కాంట్రాక్టులు లాభదాయకంగా మారవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.నిరుద్యోగులకు సంబంధించిన శుభవార్తలు కుటుంబ ఆనందాన్ని మరింత పెంచుతాయి.
మిథునరాశి : శుక్రుడు తులా రాశిలో వక్రగమనం వలన ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు సామాన్య లాభాలను పొందే అవకాశం ఉంది.గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు లభించవచ్చు. కొందరికి పదోన్నతి లేదా వేతన పెంపు కూడా దక్కవచ్చు. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు, కాంట్రాక్టులు లాభదాయకంగా మారవచ్చు . సంతానం, ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. కొత్త ప్రేమలు పుట్టుకువస్తాయని పండితులు చెబుతున్నారు
కర్కాటకరాశి: తులారాశిలో శుక్రుడు తిరోగమనం వలన ఈ రాశి వారు శారీరకంగా మానసికంగా.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాబడికి కొత్త మార్గాలు ఏర్పడుతాయి. బంధువులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ కాలంలో జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా ఇబ్బంది లేకుండా పూర్తవుతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి : శుక్రుడు తిరోగమనంలో సంచారం వలన ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అన్ని రంగాల్లో విజయం పొందే అవకాశం ఉంది. కాని చాలా కష్ట పడవలసి ఉంటుంది. నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభించేందుకు ప్రయత్నం చేయండి. వివాహితులు తమ కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఆలస్యంగా అయినా అనుకున్న పనులు నెరవేరడంతో జీవితంలో ఆనందం పెరుగుతుంది. వాహనాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు. విద్య, వృత్తి వ్యాపారాల్లో అనుకోని ప్రగతి సాధిస్తారు.కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు వాయిదా వేయండి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
►ALSO READ | ఆధ్యాత్మికం: కుబేర యంత్రం.. లక్ష్మీ కటాక్షం.. ధన ప్రాప్తికి చేయాల్సింది ఇదే..!
కన్య రాశి : తులారాశిలో శుక్రుడు తిరోగమనం వలన ఈ రాశి వారికి ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అధికార యోగం ఉంటుందని పండితులు అంటున్నారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి పరంగా లైఫ్ లో సక్సెస్ సాధిస్తారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
తుల రాశి : శుక్రుడు సొంతరాశి తులారాశి.. ఇదే రాశితో తిరోగమనం వలన ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు. కేరీర్ లో ఉన్నతస్థాయిని చేరుకుంటారు. ఉద్యోగస్తులు మంచి గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అన్ని పనుల్లోనూ అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.ఊహించని విధంగా కొత్త అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది. పెద్ద ప్రాజెక్ట్ లేదా కీలకమైన అవకాశం ద్వారా ఆదాయం పెరగవచ్చు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది.
వృశ్చికరాశి : శుక్రుడు తులారాశిలో తిరోగమనం వలన ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 3 నుంచి 42 రోజుల పాటు ఎవరికి ఎలాంటి అప్పులు ఇవ్వవద్దు.. ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. ఆర్థిక విషయాలు.. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వివాదాల విషయంలో.. ఆస్తి విషయాల్లో.. కోర్టు విషయాల్లో నిర్ణయాలను వాయిదా వేయండి. ఉద్యోగులు కార్యాలయంలో అనవసరంగా అవమానాలు పడతారు. తోటి ఉద్యోగులు వలన సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండంది. చిన్న విషయం వివాదంగా మారే అవకాశం ఉంది. ఎవరికి హామీ ఉండవద్దు. వ్యాపారస్తులు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సురాశి :శుక్రుడు తులారాశిలో తిరోగమనం వలన ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలతో పాటు పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ప్రగతి సాధిస్తారు. విదేశాల్లో పనిచేసేవారికి కూడా లాభం వస్తుంది. కొంతకాలంగా ఆగిపోయిన పనుల్లో వేగం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు.
మకర రాశి : తులా రాశిలో శుక్రుడు వక్రగతిలో సంచారం వలన ఈ రాశి వారికి అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఎవరితోనూ ఎవరి వాదనలు పెట్టుకోవద్దు. ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకొనేందుకు చాలా ఇబ్బంది పడుతుంటారు. గందరగోళంగా ఆలోచనలు వస్తుంటాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం లభించకపోవచ్చు. ప్రతి పనిలో కూడా నిరాశ కలుగుతుంది. ప్రతి విషయం సవాలుగా మారుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు కూడా కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం చాలా అవసరమనిజ్యోతిష్య పండితులు చెబుతున్నారు
కుంభ రాశి : శుక్రుడు తిరోగనం వలన ఈ రాశి వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ప్రతిపనిలో కూడా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బంధువులు.. స్నేహితుల వలన సమస్యలు వస్తాయి. ఎట్టి పరిస్థితిలో ఎవరికి అప్పు ఇవ్వవద్దు. అశాంతితో నిద్ర లేకుండా గడిపాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దని పండితులు చెబుతున్నారు.
మీన రాశి : తులారాశిలో శుక్రుడు తిరోగమనం వలన ఈ రాశి వారికి ముఖ్యంగా చాలా కాలంగా రావలసిన పాత బాకీలు వసూలవుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో మరింత బలపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి.వారు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఆలోచించరు. కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ విజయాన్ని అందుకుంటారు. కుటుంబమంతా సంతోషంగా ఉండాలని, అందర్నీ కలపడం కోసం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఆస్తి వివాదాలు అనుకోకుండా రాజీమార్గంలో పరిష్కారమై, బాగా లబ్ధి పొందుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
