లక్ష్మీదేవి అనుగ్రహం.. ధన ప్రాప్తి కలగాలంటే ఏంచేయాలి. ఏదేవుడిని పూజించాలి. ఎలా పూజ చేయాలి. కుబేర యంత్రానికి ఉండే శక్తి ఏమిటి.. ఎలాంటి కోరికలు భగవంతుడిని అడగాలి. అక్కర్లేని కోరికలు కోరికలు..వరాలు పొందితే ఏం జరుగుతుంది. పురాణాలు.. ఆధ్యాత్మికవేత్తలు ఏం చెబుతున్నారు.మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం. . .!
ప్రతి రోజు దీపారాధన చేసి మీరు చేసే పూజ చేశాక మీరు దేవుడి దగ్గర కుబేర మంత్రం 108 సార్లు జపం చేయాలి... ఇలా 3 నెలలు వదలకుండా రోజూ చేస్తే ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం కుబేరుడు చాలా ధర్మనిష్ఠ కలిగిన దైవం. చాలా జాగ్రత్తగా ఎంతో పూజలు చేయాలని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ధనం .. డబ్బు కు అధిదేవత ధనలక్ష్మీ . ధనలక్ష్మి కటాక్షం.. అనుగ్రహం ఎవరికి ఉండాలి.. ఎంత వరకు ఉండాలి.. ఏ సమయంలో ఎంత ఉండాలి.. ఇలాంటి విషయాల్లో కుబేరుడు కీలక పాత్ర పోషిస్తాడు. అందుకే కుబేరుడి అనుగ్రహం ఉంటే ధనలక్ష్మి కటాక్షం ఉన్నట్టే. రోజూ నిత్య పూజ చేసిన తరువాత కుబేర యంత్రం దగ్గర కూర్చొని..
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ
ధనధాన్య సమృద్ధిందేహీ రుద్రాయ స్వాహ
అనే కుబేర మంత్రాన్ని 108 టైమ్స్ జపం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారుఆధ్యాత్మిక వేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఎంత ఎక్కువగా ఈ యంత్రం ముందు కూర్చుని జపం చేస్తే అంత త్వరగా మంచి ఫలితం వస్తుంది... విత్తనం వేయగానే.. చెట్టు రాదు.. పెళ్లి అయిన మరుసటి రోజే ..కొడుకు పుట్టడు... అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.దైవానుగ్రహము ఉంటేనే అన్ని అనుకూలించే సమయం కూడా భగవంతుడు కలిపిస్తారు... ఇలా నమ్మకం తో చేస్తే సమస్యల నుండి బయట పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు
కుబేర యంత్రానికి పూజ చేసే విధానం
కుబేర పూజను మీరు పుట్టిన తేదికి 3 నెలల తర్వాత ఏ నక్షత్రం రోజు పుట్టారో ఆ రోజుప్రారంభించాలి. ప్రతి సోమవారం శివునికి పూజ చేయాలి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి కి పూజ చేసి ఇలా కుబేర యంత్రాని పూజను ప్రారంభించాలి. ఆడవాళ్లకు ఆటంకం కలిగినప్పుడు ఆపి మళ్ళీ 6 వ రోజు నుండి మొదలు పెట్టాలి..
కుబేరుడు చాలా సత్యవాక్కు,సౌమ్యంగా ఉండే పరమ శివ భక్తుడు.. ఈయనకు సూర్యోదయం కన్నా ముందుగా లేచి దీపారాధన చేయడం చాలా ఇష్టం... బెల్లం తో చేసిన వంటలు ఇష్టం..
అందుకే కుబేరుడుని .... హనుమంతుడి ని గాని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే వారిని యంత్రం లోనే పూజ చేయాలి..జపం అయిన తరువాత నీళ్లతో శుద్ది చేసి.. పసుపు.. కుంకుమ.. గంధం .. పూలు సమర్పించాలి. ధూపం.. దీపం. నైవేద్యం హారతి ఇవ్వాలి. ఆ తరువాత మీకు కావలసిన న్యాయబద్దమైన కోరికలు కోరుకోవాలి.
అంతేకాని ఎవరైనా అవనరమైనవి కోరుకొని ఈ సాధన దుర్వినియోగం అయి.. నష్టం కూడా జరిగే అవకాశం ఉందని పురా ణాల ద్వారా తెలుస్తుంది.దీనికి ఉదాహరణగా.. సత్య యుగంలో ఒక మానవుడు..దేనినైనా సాధించాలనే దురుద్దేశంతో అలాంటి శక్తి కావాలని శివుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై ఏదైనా ఒక వరం కోరుకోమనగా అప్పుడు ఆ వ్యక్తి దురుద్దేశంతో స్వామి.. నాకు చాలా కోరికలు ఉన్నాయి.. మీరు నాకు చాలా వరాలు కావాలి అన్నాడు.
పరమేశ్వరుడు అతని బుద్దిని గ్రహించి.. నీకు అసలు వరం పొందే అవకాశమే లేదు.. కాని నీవు చేసిన తపస్సుకు ఏదో ఒక వరం మాత్రమే ఇస్తానని చెప్పగా.. అప్పుడు ఆ వ్యక్తి.. చేసేది ఏమీ లేక ..స్వామి.. మీరు ఒక్కటే వరం ఇస్తానన్నారు కాబట్టి.. నేను మనసులో ఏది అనుకుంటే అది జరిగిపోవాలి. అలాంటి వరం ప్రసాదించమని కోరాడు.
అప్పుడు పరమేశ్వరుడు ఈ వరం వలన నీకు సుఖం .. శాంతి ఉండదని చెప్పినా.. అతడు అదంతా నేను చూసుకుంటాను.. నాకు ఆ ఒక్క వరం ఇమ్మని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడి ఇచ్చిన మాట ప్రకారం అతనికి ఆ వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు.
ఆ తరువాత ఆ వ్యక్తి అడవి నుంచి నడుచుకుంటూ వెళుతుండగా బాగా ఆకలైంది. అప్పుడు ఆ వ్యక్తి స్వామి.. నాకు మంచి షడ్రసోపేతమైన భోజనం అడుగగా వర ప్రభావంతో వెంటనే పసందైన విందు భోజనం రాగా.. వెంటనే ఆరగించాడు. ఆ తరువాత తాంబూలం అడుగగా దానిని బుగ్గన పెట్టుకున్నాడు. బాగా తినినందున కళ్లు మూతలు పడుతున్నాయి. నిద్రతో నడువలేని స్థితిలో ఉండగా పాన్పు కోరగా వెంటనే వచ్చింది. పడుకొనే సరికి బాగా నిద్ర వచ్చి పడుకున్నాడు. కొంత సేపైన తరువాత లేచి చూసేసరికి కీకారణ్యం.. అటవీ ప్రాంతం కావడంతో బాగా చీకటిగా ఉంది. ఈ చీకటిలో వెళ్లడం చాలా కష్టం కదా.. ఈ రాత్రి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకొని పొద్దున్నే లేచి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాడు.
ఇక ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా .. ఈ సమయంలో అపురూప లావణ్యవతి అయిన అప్సరసలకు మించిన అందమైన అమ్మాయి వచ్చి..నా పాదాల దగ్గర ఉండి.. ఈ రాత్రంతా నాకు పిచ్చా పాటి కబుర్లు చెబుతూ.. నా పాదాలు మెత్త మెత్తగా నొక్కుతుంటే ఎంతో బాగుంటుంది కదా అనుకున్నాడు. పరమేశ్వరుడి ఇచిన వర ప్రభావంతో అలాంటి అమ్మాయి వచ్చి.. పాదాలు దగ్గర కూర్చొని..పాదాలు సేవించమంటారా.. అని అడిగి.. నయగారాలు వలిపిస్తూ ఆ పాదాలు సేవిస్తుంది ఆ అందాల యువతి.
కొద్ది సేపయిన తరువాత.. నిజంగా ఆ అమ్మాయి.. అమ్మాయేనా.. అడవిలో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా.. ఉండరు కదా.. నన్ను మింగేసేందుకు దగ్గరలోని పెద్ద చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసి అమ్మాయిలా మారి నాదగ్గరికి వచ్చిందా అని మనసులోఅనుకున్నాడు. ఇది నిజంగా అమ్మాయి కాదు.. నిజంగా భూతమే ... నన్ను మింగేస్తుంది అని మనసులో అనుకున్నాడు. అలా ఎప్పుడైతే అనుకున్నాడో అందమైన అమ్మాయి కాస్త భూతంలా మారి గుటుక్కమని మింగేసింది. అందుకే అనవసరంగా కోరికలు కోరుకుంటే వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందని గ్రహించాలి. కాబట్టి మీరు ఎన్ని పూజలు చేసినాకాని న్యాయబద్దంగా ఉండే కోరికలు మాత్రమే భగవంతుడిని ప్రసాదించమని కోరుకోవాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
