ఫేస్ క్రీములు వేస్ట్.. ప్రతిరోజూ ఉదయాన్నే వీటిని తాగితే చర్మం మెరిసిపోవడం ఖాయం !

ఫేస్ క్రీములు వేస్ట్.. ప్రతిరోజూ ఉదయాన్నే వీటిని తాగితే చర్మం మెరిసిపోవడం ఖాయం !

అందమైన, కాంతివంతమైన చర్మం కోసం మార్కెట్లో దొరికే రకరకాల కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్‌లు వాడుతున్నారా ? అయితే ఎంతటి ఖరీదైన క్రీమ్‌లు వాడినా, మన శరీరానికి లోపలి నుంచి సరైన పోషణ అందకపోతే చర్మంపై  కాంతి కనిపించదు. "మనం ఎం  తింటామో, తాగుతామో.. అదే మన ముఖంపై ప్రతిబింబిస్తుంది" అని నిపుణులు చెబుతుంటారు. అందుకే మెరిసే చర్మం  కోసం ఉదయాన్నే పరగడుపున కొన్ని ప్రత్యేకమైన సహజ పానీయాలు తీసుకోవడం ఎంతో అవసరం. రోజును ఈ హెల్దీ డ్రింక్స్‌తో ప్రారంభించడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోవడమే కాకుండా చర్మానికి మంచి మెరుపు వస్తుంది. నిపుణులు సూచిస్తున్న ఆ అద్భుతమైన మార్నింగ్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

గోరువెచ్చని నిమ్మ నీరు: ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు (Toxins) బయటకు పోతాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మానికి సహజమైన ప్రకాశాన్ని ఇస్తుంది.

కలబంద (అలోవెరా) రసం: అలోవెరా జ్యూస్ తాగడం వల్ల శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అంతేకాకుండా చర్మంపై వచ్చే మంట, ఎరుపుదనం, మొటిమల వాపును తగ్గించడంలో  అద్భుతంగా పనిచేస్తుంది.

జీలకర్ర (జీరా) నీరు: ఉదయాన్నే జీరా నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్ట శుభ్రంగా ఉంటే ముఖంపై ఉండే  డల్ నెస్  తగ్గి, చర్మం తాజాగా కనిపిస్తుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా ముఖానికి మంచి గ్లోను అందిస్తాయి.

పసుపు నీరు: చిటికెడు పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల దానిలోని యాంటీసెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మపు రంగును బ్యాలెన్స్ చేసి, నల్లటి మచ్చలను తగ్గిస్తాయి. 

కొబ్బరి నీరు: ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అంది, చర్మానికి లభించే అత్యుత్తమ హైడ్రేషన్‌తో ముఖం ప్రెష్‌గా మారుతుంది.

నానబెట్టిన బాదం పాలు: నానబెట్టిన బాదంపప్పుతో తయారుచేసిన పాలు తాగడం వల్ల చర్మానికి అవసరమైన 'విటమిన్-E' లభిస్తుంది. ఇది చర్మాన్ని ఎంతో మృదువుగా, కోమలంగా ఉంచడానికి దోహదపడుతుంది.

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.