విలేకరులు స్వీయ నియంత్రణతో పనిచేయాలి: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

విలేకరులు స్వీయ నియంత్రణతో పనిచేయాలి: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
  • విలేకరులు స్వీయ నియంత్రణ విధించుకోవాలి 
  •  మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి


బాన్సువాడ, వెలుగు : రిపోర్టర్లు స్వీయ నియంత్రణ విధించుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విలేకరులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృత్తిలో నైపుణ్యం పెంపొందించడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నైతికత దిగజారకుండా రిపోర్టింగ్ చేయాలని సూచించారు. రిపోర్టర్లు స్వచ్చంధంగానే ఈ వృత్తిలోకి వచ్చారని, తమను తాము నియంత్రించుకుంటూ పనిచేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రిపోర్టింగ్ కత్తిమీద సాము లాంటిదని అభిప్రాయపడ్డారు. ఎల్ నినో ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని మీడియా అద్భుతంగా వివరిస్తూ, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాలరాజు, కామారెడ్డి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రజనీకాంత్, బాన్సువాడ సహకార పరపతి సంఘం చైర్మన్ కృష్ణారెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గంగాధర్, లతీఫ్ పాల్గొన్నారు.