హైదరాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లా బోధన్, సిద్దిపేట జిల్లా చేర్యాల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవీకాలం ముగియడంతో కొత్త పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన పాలకవర్గాల పదవీకాలం రెండేళ్లు ఉండనుంది. బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా దేవభక్తుని నాగేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా నరేందర్‌రెడ్డి నియమితులయ్యారు. చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొమ్మూరి ప్రశాంత్, వైస్ చైర్మన్‌గా బోయిని శ్రీనివాస్ నియామకం అయ్యారు.
రైతులకు మెరుగైన సేవలు అందించడం, మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, తూకం, నిల్వ, వేలం ప్రక్రియల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నూతన పాలకవర్గాలు రైతుల సమస్యల పరిష్కారానికి చురుగ్గా పనిచేయాలని ఆకాంక్షించారు.
