బిగ్ బాస్ 10 బిగ్ ట్విస్ట్: హౌస్‌లోకి భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. డబుల్ ఎలిమినేషన్‌లో వర్షిణి ఎగ్జిట్ ఖాయమా?

బిగ్ బాస్ 10 బిగ్ ట్విస్ట్: హౌస్‌లోకి భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. డబుల్ ఎలిమినేషన్‌లో వర్షిణి ఎగ్జిట్ ఖాయమా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10  రోజు రోజుకూ మరింత ఉక్కంఠను రేపుతోంది. కంటెసటెంట్ల మధ్య గొడవలు, ఎమోషన్స్ , మైండ్ గేమ్స్ తో హౌస్ హీటెక్కుతోంది. ప్రస్తుతం నాలుగో వారం పూర్తవుతున్న వేళ.. ప్రేక్షకులు, నెటిజన్ల దృష్టి అంతా ఈ వారం జరగబోయే డబుల్ ఎలిమినేషన్, రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీలపైనే ఉంది.

ముఖ్యంగా కొత్త కంటెస్టెంట్లు అక్టోబర్ సెకండ్ వీక్ లో హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.  అయితే దీనిపై బిగ్ బాస్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వైల్డ్‌కార్డ్ రేసులో 'రన్ రాజా రన్' ఫేమ్ సీరత్ కపూర్, నటరాజ్ భార్య, డ్యాన్సర్ నీతు, తెలుగు ఎన్‌ఆర్‌ఐ బ్లాగర్ మౌనీషా చౌదరి, గతంలో 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష2'లో కనిపించిన రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి.  వీరితో పాటు సోనియా సింగ్, సౌందర్య రెడ్డి, జబర్దస్త్ కమెడియన్ నూకరాజు, రాకింగ్ రాకేష్ పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో ఎంతమంది నిజంగా ఎంటర్ అవుతారన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.

ఇక మరోవైపు నాలుగో వారం నామినేషన్స్‌లో ముకేశ్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి ఉన్నారు. నామినేషన్ ప్రక్రియలో త్రిగుణ్–రోహిత్, ముకేశ్–అపూర్వ మధ్య విభేదాలు మరోసారి హీట్ పెంచాయి. అయితే వర్షిణి విషయంలో ఈక్వేషన్ మరింత ఆసక్తికరంగా మారింది. గత వారం ఆమె ఎలిమినేషన్ జోన్‌లో ఉండగా, కెప్టెన్‌గా ఉన్న ముకేశ్ తన కెప్టెన్సీ, ఇమ్యూనిటీని వదులుకుని ఎలిమినేషన్‌ను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాడు. దీంతో వర్షిణి సేవ్ అయ్యింది.

 అయితే, సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉన్న యాంకర్ వర్షిణి సౌందరాజన్ ప్రస్తుతం లీస్ట్ ఓటింగ్‌తో తీవ్ర ప్రమాదంలో పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హౌస్‌లో ఆశించిన స్థాయిలో టాస్క్‌లు ఆడకపోవడం, ముఖేష్ పట్ల ఆమె ప్రవర్తనపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వర్షిణితో పాటు చరణ్, సృష్టి కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు.ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే చివరి నిమిషంలో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో ఆసక్తిగా మారింది.

 ఇప్పుడు వైల్డ్‌కార్డ్స్ నిజంగానే భారీగా ఎంటర్ అయితే.. ఇప్పటికే ఏర్పడిన గ్రూపులు, ఫ్రెండ్‌షిప్స్, గొడవల సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కొత్తవాళ్లు ఎవరిని టార్గెట్ చేస్తారు? ఎవరి గ్రూపులో చేరతారు? ప్రస్తుత కంటెస్టెంట్లలో ఎవరి గేమ్‌పై ప్రభావం పడుతుంది? అన్న  చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది.