భువనగిరి రిలయన్స్ మార్ట్లో తనిఖీలు.. ఎక్పైరీ ప్యాకెట్లు చూసి షాకయిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు !

భువనగిరి రిలయన్స్ మార్ట్లో తనిఖీలు.. ఎక్పైరీ ప్యాకెట్లు చూసి షాకయిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు !

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరిలోని రిలయన్స్ మార్ట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీ ఎత్తున ఎక్పైర్ అయిన ఆహార పదార్థాల ప్యాకెట్స్ను గుర్తించారు. యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ డిసిగ్నెటెడ్ ఆఫీసర్ స్వాతి ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. భారీ ఎత్తున ఎక్స్పెయిరైన ఆహార పదార్థాల ప్యాకెట్స్ గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని సిబ్బందితో బయట పారవేయించేశారు.

కిరాణా, జనరల్‌‌ స్టోర్స్‌‌, ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి మిఠాయిలు, క్యాండీలు, ప్యాకేజ్డ్‌‌ ఫుడ్‌‌ తదితరాల నాణ్యత, ప్యాకింగ్‌‌, లేబులింగ్‌‌, గడువు తేదీలు, నిల్వ విధానాలను కూడా పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు. వ్యాపారులు ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు‌ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిలయన్స్ స్టోర్స్లో గతంలో కూడా ఇలాంటి నాణ్యతా లోపాలు వెలుగుచూశాయి.

* భువనగిరి రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ సూపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు.

* ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై సంస్థకు సెక్షన్ 32(1)(a) కింద ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ.

* స్టోర్‌లో కుళ్లిన కూరగాయలు, పండ్లు, ఎక్స్‌పైరీ ఆహార పదార్థాలు, లేబులింగ్ లోపాలను గుర్తించిన అధికారులు.

* పరిశుభ్రత, పెస్ట్ కంట్రోల్, సిబ్బంది ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, తప్పనిసరి రికార్డుల నిర్వహణలో లోపాలు గుర్తింపు.

* సుమారు 60 వేల విలువైన 118 కేజీల కుళ్లిన కూరగాయలు, పండ్లు, ఎక్స్‌పైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ ధ్వంసం.

* నిర్ణీత గడువులో లోపాలు సరిదిద్దుకోకపోతే ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి హెచ్చరిక.