ఆఫీస్ బిజీలో దబాదబా తింటున్నారా? తిండి నమిలి తినకపోతే ఏమైతదో తెలుసా ?

ఆఫీస్ బిజీలో దబాదబా తింటున్నారా?  తిండి నమిలి తినకపోతే ఏమైతదో తెలుసా ?

నిజం చెప్పాలంటే..పొద్దగాల్నే టైమ్ కి బ్రేక్ ఫాస్ట్, పగటిపూట లంచ్ ప్రశాంతంగా కూసోని తినేటోళ్లు చాన తక్కువమందే ఉంటరు. రోజంతా ఉండే బిజీ షెడ్యూల్! పొద్దున్నే ఆఫీస్ కి లేటైతుందని నాలుగైదు బుక్కలు తిని అవతలపడ్తారు. వర్క్ లోడ్  పడి లంచ్ కూడా 'మమ' అనిపిస్తరు. ఇట్ల బాడీకి ఎంతో ముఖ్యమైన రెండు మీల్స్ ఉడత మింగినట్టు దబాదబా మింగుతరు! అయితే, మంచిగా నమలకుండ, ఆదరాబాదరా తింటే.. మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతది! కొంచెం టైమ్ తీస్కోని.. కూసోని సీరియస్ గా ఆలోచించాల్సిన ముచ్చటిది!!

తిండి మనకు శక్తినిస్తది. రోజంతా యాక్టివ్ ఉండనీకి ఇదే సాయపడ్తది. కాబట్టి, దీనికోసం బాడీ మస్తు పోషకాల్ని తీసుకోవాలె. కానీ, ఆద రాబాదరా తిన్నప్పుడు.. అది ఒంటికి పట్టదు. అంతేనా? ఇట్ల ఫాస్ట్ తింటే, అక్కెరకొచ్చేదానికంటే ఎక్కువ తింటం. ఎందుకంటే, 'అర్రె.. ఎక్కువ తింటున్నవా' అని బ్రెయిన్ రియలైజ్ అయ్యేందుకు కూడా ఆ వేగంలో గ్యాప్ దొరకదు. తీరువాటంగా కూసొని.. నిమ్మలంగా నములుకుంట తింటే బ్రెయిన్ మంచిగా పని చేస్తది. కడుపునిండంగనే 'ఇగ చాలు..' అని పొట్ట బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తది.

ఎక్కువ తింటం
ఆదరాబాదరా తింటే.. తెల్వకుండనే ఎక్కువ తింటం. దీంతో బరువు పెరుగుతాం. దీంతో హెల్త్ ఇష్యూస్ మొదలైతయ్. బాడీలో మిగిలి పోయిన ఎక్స్ట్రాట్రా కెలోరీలను సెల్స్ నిల్వ చేసుకుంటయ్. ఇది బరువు పెరగడానికీ కారణమైతది. హెల్దీ వెయిట్ మెయింటేన్ చేయాలంటే.. స్లోగా తినాలె. తినేటప్పుడు ఎక్కడో ఆలోచించకుండా 'ప్రజెంట్ మూమెంట్'లో ఉండాలె. ఇట్ల చేస్తే.. అధిక మొత్తంలో మన బాడీ పోషకాలను గ్రహిస్తది. అనవసరమైన బరువు పెరగకుండా అడ్డుకుంటది.

జీర్ణం కాదు
స్పీడ్ గా తింటే.. ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. తిన్న తిండి జీర్ణం కాదు. స్లోగా నమిలి తిన్నప్పుడే.. ఆహారం.. నీళ్లతో కలిసి ఈజీగా జీర్ణమైతది. ఫాస్ట్ గా తింటే.. అది డెరెక్ట్ గా డయాబెటీస్ కి కారణం కాకపోవచ్చు. కానీ, ఇది డయాబెటీస్ రిస్క్ ని పెంచుతుందనడంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఫాస్ట్ తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయితయనీ, ఈ గ్యాస్ ఇన్సులీన్ విడుదలను అడ్డుకోవడం వల్ల.. టైప్-2 డయాబెటీస్ వస్తదని ఇప్పటికే జరిపిన చానా స్టడీల్లో బయటపడ్డది. తిండి మీద ధ్యాస పెట్టకుండా.. తింటే ఏ తీరుగా చూసిన మంచిది కాదు. కాబట్టి, కొంచెం టైమ్ తీసుకొని ప్రశాంతంగా కూసోని, నిమ్మలంగా.. నమిలి తినడం ఇప్పట్నించైనా అలవాటు చేసుకోవాలె!